అతి త్వరలోనే మోడీ సర్కార్‌కు గోరీ కడతాం: బొమ్మెర రామ్ముర్తి ఫైర్

by Satheesh |
అతి త్వరలోనే మోడీ సర్కార్‌కు గోరీ కడతాం: బొమ్మెర రామ్ముర్తి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చెయ్యాలని చూస్తే తీవ్ర పరిణామాలను చూడాల్సి వస్తుందని తెలంగాణ ఉద్యమకారుడు బొమ్మెర రామ్ముర్తి హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేయాలని ప్లాన్​చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి నష్టాన్ని చేకూరుస్తుందని ఆయన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అతి త్వరలో మోడీ సర్కార్‌కు గోరీ కడుతున్నామన్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు చేసి, స్తంబింపజేస్తామన్నారు. బతకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసి, కోట్లాది మంది ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నఆడ బిడ్డకు అవమానం జరిగితే సహించేది లేదని రామ్ముర్తి నొక్కి చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమాలు చూసి బీజేపీ ఓర్వలేకపోతుందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీ అన్ని పార్టీలను ఇబ్బంది పెడుతుందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed