Bomb Threat: మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

by Shiva |   ( Updated:2024-10-30 03:55:21.0  )
Bomb Threat: మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Shamshabad International Airport)కు మళ్లీ బాంబు బెదిరింపు (Bomb Threat) కాల్స్ వచ్చాయి. ఎయిర్‌పోర్టులోని మొత్తం మూడు విమానాలకు ఆగంతకులు బాంబు బెదిరింపు కాల్స్‌ చేశారు. చెన్నై నుంచి హైదరాబాద్ (Chennai to Hyderabad) వస్తున్న ఎయిరిండియా ఫ్లైట్, హైదరాబాద్ నుంచి చెన్నై (Hyderabad to Chennai) వెళ్తున్న రెండు ఇండిగో ఫ్లైట్లకు కాల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్‌పోర్టులో నిఘా వర్గాలు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బెదిరింపు కాల్స్ వచ్చిన మూడు విమానాలను సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది క్షణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 70 విమాన సర్వీసులకు బాంబు బెదరింపు మెయిల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

కాగా, ఎయిర్‌పోర్టు (Airports)లు, ఫ్లైట్స్‌ (Flights)కు బాంబు బెదిరింపు కాల్స్ రావడం పట్ల కేంద్రం చాలా సీరియస్‌గా ఉందని ఇటీవలే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మెహన్ నాయుడు (Rammohan Naidu) స్టేట్‌మెంట్ ఇచ్చారు. సోషల్ మీడియా (Social Media) ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని, బాంబు బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారో విచారణలో తేలుతుందని అన్నారు. ఇక నుంచి ఏవియేషన్‌ చట్టాల్లో (Aviation Laws) కీలక సవరణలు చేస్తామని పేర్కొన్నారు. ఫేర్ కాల్స్ చేస్తున్న నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని.. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాంబు బెదిరింపులకు పాల్పడిన వారికి విమానాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story