సీఎంఆర్ విద్యాసంస్థల్లో ఉర్రూతలూగించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్

by Sathputhe Rajesh |
సీఎంఆర్ విద్యాసంస్థల్లో ఉర్రూతలూగించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్
X

దిశ, మేడ్చల్ టౌన్: గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ విద్యా సంస్థల మైదానంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సంగీత విభావరి యువతను ఉర్రూతలూగించింది. పలూజ మ్యూజికల్ కన్సర్ట్ పేరుతో నిర్వహించిన విభావరికి బాలీవుడ్ గాయకులు విశాల్ శేఖర్ ద్వయం తమ మ్యూజిక్ బృందంతో పాటలు పాడారు.

ఈ కార్యక్రమానికి యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి, విశాల్ శేఖర్ పాడిన పాటలకు వేదిక ముందు ఉత్సాహంతో నృత్యాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్ ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చామకూర మహేందర్ రెడ్డి, సిఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్ గోపాల్ రెడ్డి, మల్లారెడ్డి యూనివర్సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి, ప్రీతి రెడ్డి, శ్రీశైలం రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story