రక్తం చిందించని ఆయుధం ఓటు : విశారాదన్ మహారాజ్

by Sathputhe Rajesh |
రక్తం చిందించని ఆయుధం ఓటు : విశారాదన్ మహారాజ్
X

దిశ, భీమదేవరపల్లి: రక్తం చిందించని ఆయుధం ఓటు హక్కు అని దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపకులు డాక్టర్ విశారాధన్ మహారాజ్ అన్నారు. ఈ ఏడాది మార్చి15న నాగరకర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ప్రారంభమైన 10వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర గురువారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి ములుకనూరు గ్రామానికి చేరుకుంది. మండలంలోని ముల్కనూర్ గ్రామంలో డీఎస్పీ జెండా ఆవిష్కరించారు. ములుకనూరు గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ స్వరాజ్య పాదయాత్ర 9నెలల పాటు కొనసాగుతుందన్నారు. తెలంగాణలో రెడ్డి, రావుల రాజ్యం నడుస్తుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్బండ వర్గాల రాజ్యం రావాలని పిలుపునిచ్చారు.

మన రాజ్యం కోసం పోరాడాలని ఏనాడో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పారన్నారు. అంబేద్కర్ ఓటు అనే ఆయుధం మనకు ఇచ్చాడన్నారు. దొరలు, పెత్తందార్లు, రెడ్డి, రావు మీద పోరాడే ఆయుధం ఓటు హక్కు అని దాన్ని అమ్ముకోవద్దన్నారు. రూ.500లకు ఓట్లు వేసేవారు ఉన్నంత వరకు బానిసలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సమాజం, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే ఓటుహక్కు విలువను తెలుసుకోవాలన్నారు. సమాజం, రాజ్యం కోసం యుద్ధం చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇంకా 4వేల కిలోమీటర్ల పూర్తిచేసుకుని మార్చి 15 కాన్షిరం జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు భారీ ఎత్తున సబ్బండ కులాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎదులాపురం తిరుపతి, మాడుగుల రాజకొమరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed