గెలిస్తే హడావిడి పాలిటిక్స్ ఓడితే డైవర్షన్ పాలిటిక్స్.. కేసీఆర్ పై బీజేపీ విమర్శ

by Prasad Jukanti |   ( Updated:2024-04-05 06:11:13.0  )
గెలిస్తే హడావిడి పాలిటిక్స్ ఓడితే డైవర్షన్ పాలిటిక్స్.. కేసీఆర్ పై బీజేపీ విమర్శ
X

దిశ, డైనమిక్ బ్యూరో:గెలిచినప్పుడు ఒకలా ఓడినప్పుడు మరొలా వ్యవహరించడం కేసీఆర్ కే చెల్లుతుందని టీ బీజేపీ విమర్శించింది. కేసీఆర్ వైఖరిపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన బీజేపీ.. కేసీఆర్ ఓ మోనార్క్ అని ఎన్నికల్లో గెలిస్తే హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి సొల్లు చెప్పడం, ఫాం హౌస్ నుంచి పరిపాలించడం, అహంకారం ప్రదర్శించడం చేస్తారని దుయ్యబట్టింది. ఓడిపోతే మాత్రం అదే ఫామ్ హౌస్ లో ఎవరికీ దొరకకుండా పడుకోవడం, రైతుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నీతులు చెబుతుంటారని సెటైర్ వేసింది.



Advertisement

Next Story