BJP: 'నన్ను చంపగలరు, నా ఆలోచనలను కాదు'.. భగత్ సింగ్ జయంతిపై బండి సంజయ్ ట్వీట్

by Ramesh Goud |
BJP: నన్ను చంపగలరు, నా ఆలోచనలను కాదు.. భగత్ సింగ్ జయంతిపై బండి సంజయ్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వాతంత్య్ర సమరయోధుడు, వలసవాద వ్యతిరేక విప్లవ కారుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పెట్టిన పోస్టులో భగత్ సింగ్ ఫోటోతో పాటు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన.. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యువ కిశోరం, భరతమాత స్వేచ్ఛ కోసం ఉరికంబాన్ని ఆనందంగా ముద్దాడిన వీరతేజం అని కొనియాడారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ భారతీయుల గుండెల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన సింహనినాదం అని చెప్పారు. అలాగే “నన్ను చంపగలరు కానీ నా ఆలోచనలను చంపలేరు” అంటూ ఆంగ్లేయుల గుండెల్లో భయాన్ని పుట్టించిన విప్లవ కెరటం అంటూ.. షహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఆ త్యాగధనుడికి నమస్సుమాంజలులు అని కేంద్రమంత్రి రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed