Bhagat Singh : షహీద్ భగత్ సింగ్‌కు సీఎం రేవంత్ నివాళులు

by Ramesh N |
Bhagat Singh : షహీద్ భగత్ సింగ్‌కు సీఎం రేవంత్ నివాళులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భగత్‌సింగ్‌కు నివాళులు అర్పించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

స్వాతంత్య్ర సమరంలో ప్రభావశీల విప్లవకారుడిగా భగత్‌సింగ్ వీరోచిత పోరాటాలు యువతకు ఆదర్శప్రాయంగా నిలిచాయని సీఎం స్మరించుకున్నారు. కాగా, దేశ స్వాతంత్ర్యం కోసం తన చివరి శ్వాస వరకు పోరాడి 23 ఏళ్ల వయస్సులో ఉరికంబం ఎక్కి ప్రాణాలర్పించిన అమరవీరుడు భగత్ సింగ్.

Advertisement

Next Story

Most Viewed