- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jagapathi Babu: నీకు నాకు కొవ్వు ఎక్కువ.. మంచు లక్ష్మిపై జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ (పోస్ట్)
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నటుడు జగపతి బాబు పలుపలు సినిమాల్లో విలన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలతో కలిసి పని చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపు 100 సినిమాల్లో నటించి ఏడు నంది అవార్డులను కూడా అందుకున్నారు. అయితే జగపతి బాబు గత ఏడాది ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రాంగి’ సినిమా విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి జగపతి బాబు ఏ కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు.
తాజాగా, జగ్గూ భాయ్ నా డైలీ రొటీన్ వీడియోను షేర్ చేశారు. అందులో ఏమన్నారంటే.. ‘‘వాకింగ్ చేశాక కాకరకాయ జ్యూస్ తాగారు. ఇది సూపర్ చెండాలంగా ఉంది దీనమ్మ అని చెప్పారు. ఆ తర్వాత బెండకాయ జిగురు, బొప్పాయి, కీరా, ఆపిల్, సద్ది అన్నం తింటాను. ఈ రోజు ఓట్ మిల్ లేదు. అందరూ బ్రేక్ ఫస్ట్ చేసిన చేయకున్నా జిమ్‌కు వెల్లండి’’ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోకు మంచు లక్ష్మి ఎందుకు బెండకాయ జ్యూస్? అని ప్రశ్నించింది.
దానికి జగ్గూభాయ్ ‘‘ఆ రసం కొలెస్ట్రాల్‌కు చాలా మంచిది. నీకు, నాకు కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చాలా అవసరం’’ అని రిప్లై ఇచ్చినట్టు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. కానీ అది జగ్గూబాయ్ పెట్టాడా లేక పెట్టి డిలీట్ చేశాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక మంచు లక్ష్మి కూడా ‘‘నాకు అన్నీ బాగానే ఉన్నాయి అన్నో. మెంటల్ ఇష్యూస్ తప్ప ఇంకా ఏమీ లేదు’’ అని సమాధాన మిచ్చింది. మంచు లక్ష్మి, జగ్గూబాయ్ చాట్‌ను నెటిజన్లు స్క్రీన్ షాట్ తీసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. కానీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు మంచు లక్ష్మిని అంత మాట అన్నాడా? అని షాక్ అవుతున్నారు.
(Credits to Jaggu Bhai Instagram Channel)