తిరుమల డిక్లరేషన్ వ్యవహారం.. వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
తిరుమల డిక్లరేషన్ వ్యవహారం.. వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో తిరుమల డిక్లరేషన్(Tirumala Declaration) వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల డిక్లరేషన్ పై ‘నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకుంటారేమో రాసుకోండి’ అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌(YS Jagan) చేసిన వ్యాఖ్యల పై ఉండి ఎమ్మెల్యే(MLA) రఘురామకృష్ణంరాజు ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో గతంలో తనను చిత్రహింసలకు గురి చేసినప్పుడు ఆయన మతం(Religion) మానవత్వం(humanity) ఎక్కడ పోయిందని RRR ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్‌ ఇచ్చి పూజిస్తే క్రైస్తవుల ఓట్లు తనకు దూరమవుతాయని జగన్‌ ఆందోళన చెందుతున్నారేమో అని ఎద్దేవా చేశారు.

గతంలో అబ్దుల్‌ కలాం(Abdul Kalam), సోనియాగాంధీ వంటి వారు స్వామి వారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్‌(Declaration) ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అంతేకాదు ఆనాడు జగన్‌ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వాలని అడిగితే అధికారులను చీదరించుకొని, చెప్పులు వేసుకుని మాడవీధుల్లో తిరిగారని ఫైరయ్యారు. జగన్‌తో పాటు తిరుమలకు(Tirumala) అల్లరి మూకలు చేరి చిల్లరగా వ్యవహరిస్తే బాధ్యత(responsibility) ఎవరిది అని ప్రశ్నించారు. ఆ భయంతోనే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed