పట్టభద్రుల MLC ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. కీలక నేతకు బాధ్యతలు

by GSrikanth |
పట్టభద్రుల MLC ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. కీలక నేతకు బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ తెలంగాణ అధిష్టానం దృష్టి సారించింది. ఓటర్ ఎన్‌రోల్‌మెంట్‌కు నోటిఫికేషన్ రావడంతో బీజేపీ కసరత్తు ప్రారంభించింది. అంతేకాదు.. ఈ ఓటర్ ఎన్‌రోల్‌మెంట్‌ కోసం బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్నీ షురూ చేసింది. దీనికి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును కోఆర్డినేటర్‌గా నియమించింది. ఈ ఎమ్మెల్సీ రేసులో గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.

అయితే.. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ-వరంగల్‌-ఖమ్మంలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ.. మళ్లీ ఇప్పటివరకు ఈ ఎన్నికపై దృష్టి పెట్టలేదు. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం భారీగా పెరగడంతో ఒక్కసారిగా జోరు పెంచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story