- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ప్రధాని మోడీ వరంగల్ పర్యటన.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ప్రధాని మోడీ జులై 8న వరంగల్ కు వస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా దాదాపు రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు పీఎం మోడీ శంకుస్థాపన చేయనున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, సుసంపన్నం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ వరంగల్ సభకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి బీజేపీ అధిష్టానం ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది.
అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటానికి కిషన్ రెడ్డి తొలుత నిరాకరించినప్పటికీ అధిష్టానం చెప్పడంతో ఒప్పుకున్నారు. ఇక అధ్యక్ష పదవి కోల్పోయిన బండి సంజయ్ కి అంతకు మించిన పదవే వరించనున్నట్లు బీజేపీలో ప్రచారం జరుగుతోంది. అయితే తనకు కేంద్ర మంత్రి పదవి లాంటివి ఏమీ వద్దని, తాను ఓ సాధారన పార్టీ కార్యకర్తగానే ఉంటానని బండి సంజయ్ అధిష్టానంతో చెప్పినట్లు తెలుస్తోంది.