రిజర్వేషన్లపై బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలి:ఆర్.కృష్ణయ్య

by Prasad Jukanti |
రిజర్వేషన్లపై బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలి:ఆర్.కృష్ణయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ కాచిగూడాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రధాని మోడీ పదేళ్లుగా అధికారంలో ఉండి బీసీలకు ఒక్క పథకం కూడా తీసుకురాలేదని ధ్వజమెత్తారు. ఈ దేశంలోని బీసీలంతా కులవృత్తులలోనే ఉండాలనే బానిస మనస్తత్వం, అగ్రకుల అహంకారం ఈ పాలకులకు ఉందని ఆరోపించారు. ఇది మార్చుకోవాలని హెచ్చరించారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని తాము ఈదేశంలో వాటా దారులమన్నారు.

Advertisement

Next Story