- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'పొంగులేటి' చేరిక ఆలస్యం.. KCR సభను తలదన్నేలా BJP భారీ ప్లాన్!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వీక్‌గా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు బీజేపీ శ్రమిస్తోంది. ఆయా జిల్లాల వారీగా ప్రభావితం చేయగలిగిన నేతలను చేర్చుకోవడంపై ప్రధాన దృష్టిసారిస్తోంది. అలా నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకున్న కమలనాథులు బైపోల్‌లో ఓడినా భారీగా ఓటు బ్యాంకును రాబట్టుకున్నారు. తర్వాత ఫోకస్ ఖమ్మంపై పెట్టిన కాషాయ నేతలు పొంగులేటిని చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం పొంగులేటి కాషాయతీర్థం పుచ్చుకుంటారని భావించారు. అయితే పలు కారణాల వల్ల ఆయన చేరిక ఇంకాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వచ్చే నెలలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
కాస్త ఆలస్యమైనా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కమలం గూటికి చేరడం పక్కా అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీని తగ్గించడంతో పొంగులేటి సర్కార్ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన ఖమ్మం భారీ బహిరంగ సభలోనూ ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీలు, ఫొటోలు ఎక్కడా దర్శనమివ్వలేదు. దీంతో పార్టీ అయన్ను వదులుకునేందుకు సిద్ధమైందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఖమ్మంలో కేసీఆర్ సభ రోజే ముఖ్యమంత్రికి షాకివ్వాలని బీజేపీ నేతలు చూసినా అనివార్య కారణాల వల్ల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర మంత్రి అమిత్ షా మీటింగ్ వాయిదాపడింది.
గతంలో అనుకున్న ప్రకారం బుధవారం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అనంతరం ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి తన అనుచరులను సైతం బీజేపీలో చేర్పించాలని పొంగులేటి ప్లాన్ చేసుకున్నారు. కాగా ఫిబ్రవరి రెండో వారం తర్వాతే ఆయన సైతం పార్టీలో చేరేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సభను తలదన్నేలా మరో భారీ బహిరంగ సభ నిర్వహించి చేరాలని పొంగులేటి భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు రాష్ట్రాల సీఎంలను, మాజీ సీఎంలను తీసుకువచ్చి ప్రజలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేయడంతో ఆయనకు షాకివ్వాలనే యోచనలో బీజేపీ, పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చేరిక కాస్త ఆలస్యమైనా కేసీఆర్‌కు దిమ్మతిరిగేలా దెబ్బ కొట్టాలని డిసైడ్ అయినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read....