- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Supriya Sule: బిట్ కాయిన్ వివాదంపై ఎంపీ సుప్రియ సూలే స్పందన
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly polls) వేళ ప్రతిపక్ష ఎంపీ సుప్రియా సూలేపై క్రిప్టో కరెన్సీ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) చీఫ్ శరద్ పవార్ కూతురు(NCP (SP) leader) సుప్రియా సూలే(MP Supriya Sule) స్పందించారు. ‘నేను బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడాను. దాని గురించి తీవ్రమైన సమస్యలను లేవనెత్తిన వ్యక్తిని. బీజేపీ ఆరోపణలను సమాధానం ఇవ్వడం నా బాధ్యత. ఎందుకంటే నేను పూర్తి పారదర్శకతను విశ్వసిస్తాను. బీజేపీ అడిగిన ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనిపై పుణె కమిషనర్‌కు ఈ ఆడియోలు, వీడియోలు పంపించి.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను. మహారాష్ట్ర పోలీసులపై నాకు నమ్మకం ఉంది. రుజువు లేకుండా ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయరని భావిస్తున్నా. నా లాయర్ల ద్వారా సుధాన్షు త్రివేదికి క్రిమినల్ పరువు నష్టం నోటీసులు పంపాను. సుధాన్షు త్రివేది ఏ ఊరిలో కావాలన్నా, ఏ ఛానెల్‌లో కావాలన్నా, ఏ సమయంలో కావాలన్నా, ఎక్కడికి పిలిచినా నేను వచ్చి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నేను లేదు, అబద్ధాలు, ఆరోపణలన్నీ అబద్ధం అని సమాధానం ఇస్తాను’ అని ఆమె అన్నారు.
క్రిప్టో కరెన్సీ కుంభకోణం
క్రిప్టోకరెన్సీ కుంభకోణంలో ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) చీఫ్ శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే(MP Supriya Sule), మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే(Maharashtra Congress chief Nana Patole) ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది(BJP MP Sudhanshu Trivedi) ఆరోపించారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు సుప్రియా సూలే, నానా పటోలే, మాజీ పోలీస్ కమిషనర్ ఓ డీలర్‌తో కలిసి అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది విలేకరుల సమావేశంలో కొన్ని ఆడియో క్లిప్‌లను ప్లే చేశారు. క్రిప్టో కరెన్సీ కుంభకోణంలో వీరికి ప్రమేయం ఉందని, ఎన్నికల ప్రచారానికి నిధుల కోసం ఇద్దరు నేతలు బిట్‌కాయిన్ మానిప్యులేషన్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా లభించిన నగదును మహారాష్ట్రలో ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్నారని పాటిల్ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు.