- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌పై ఈడీ కేసు.. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న తెలంగాణ ఏసీబీని ఈడీ కోరింది. ఈ క్రమంలో గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ రంగంలోకి దిగడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. గురువారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాసేపటి క్రితమే కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది.. ఆయన కోసం ఈడీ అధికారులు వచ్చారని అన్నారు.
కేసీఆర్, హరీష్ రావు, వెంక్రటామిరెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ అని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఈడీ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావుకు ముందుంది ముసళ్ల పండుగ అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అనడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్కామ్‌పై ఈడీ దృష్టి సారించడంతో ఈ కేసు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.