- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత బెయిల్ పై స్పందించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పొందిన విషయం తెలిసిందే. కాగా కవిత బెయిల్ పొందడం పట్ల పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నాయకులు కవిత బెయిల్ కోసం బీజేపీతో లాలూచి పడ్డారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.. కాంగ్రెస్ పార్టీకి కోర్టుల మీద నమ్మకం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఈ బెయిల్ విషయం రాద్దాంతం చేస్తున్నారని మండి పడ్డారు. ఏదైనా కేసులో ఓ వ్యక్తి బెయిల్ పొందడం చాలా సాధారణ విషయమని, దానికి లేనిపోని నిందలు మాపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవితకు బెయిల్ వస్తే బీజేపీకి ఏంటి లింకు అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని నమ్ముతామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకోవడం కాదు.. దాన్ని పాటించాలని, కోర్టులను నమ్మాలని ఎంపీ రఘునందన్ రావు హితవు పలికారు.
- Tags
- raghunandan rao