- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రేవంత్ రెడ్డి తెరిచిన గేట్ లోంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవాలి’
దిశ, వెబ్‌డెస్క్: ‘ఇవాళే గేట్లు తెరిచాం. ఎంత మంది చేరుతారో చెప్పలేం’ అని నిన్న బషీర్‌బాగ్‌లో నిర్వహించిన ‘మీద్ ద ప్రెస్’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. సోమవారం జగిత్యాల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్ష్మణ్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతచ తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్‌కు మార్గం సుగమం కాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాము అధికారాన్ని పడగొట్టబోమని.. పడిపోతే నిలబెట్టేందుకు సహకరించబోము అని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరిచామని మాట్లాడుతున్నాడు.. ఆ తెరిచిన గేట్ లోంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటకు పోకుండా జాగ్రత్త పడాలని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు. మెజార్టీ స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పూర్తిగా నేలమట్టం అయిపోయిందని.. ఇక ఆ పార్టీ పుంజుకోవాలంటే ఏదైనా అద్భుతం జరుగాలని కీలక వ్యాఖ్యలు చేశారు.