బీఆర్ఎస్ దారిలోనే రేవంత్ రెడ్డి.. గ్యారంటీల పేరుతో మోసం

by GSrikanth |
బీఆర్ఎస్ దారిలోనే రేవంత్ రెడ్డి.. గ్యారంటీల పేరుతో మోసం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ దారిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని, ఆ సర్కారు తీరునే కాంగ్రెస్ అవలంభిస్తోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సిఫార్సులు లేకుండా అవార్డులు ఇస్తోందని, రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తోందని ఆయన చెప్పారు. కానీ కాంగ్రెస్ పేదలను గ్యారంటీల పేరుతో మోసం చేస్తోందని విమర్శలు చేశారు. ఏబీవీపీ విద్యార్థినిపై పోలీసులు అనుసరించిన తీరు దురదృష్టకరమని ఫైరయ్యారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లను గెలిపించాలని కోరారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మోడీ పాలనలో దళారుల బెడద లేదని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లౌకికవాదంగా కాంగ్రెస్ భావిస్తోందని విరుచుకుపడ్డారు. సోమనాథ ఆలయ నిర్మాణం చేపడితే ఆనాడు నెహ్రూ తిరస్కరించారని, నేడు అయోధ్య రామాలయం ప్రారంభాన్ని రాహుల్ గాంధీ తిరస్కరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ప్రజలే కూడా తిరస్కరించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed