- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BRS మహిళలకు ఎన్ని టికెట్లు ఇచ్చిందో చెప్పాలి..? MP లక్ష్మణ్ డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ కోరారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళాల అభ్యున్నతికి మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. బిల్లును వ్యతిరేకించేవారికి రానున్న రోజుల్లో రాజకీయంగా పుట్టగతులు ఉండవు అన్నారు. బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే మోడీ తెచ్చిన మహిళ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలన్నారు. బీఆర్ఎస్ చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదన్నారు. మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లను కేటాయించిందో ప్రజలకు తెలుసు అన్నారు.
మొదటి క్యాబినెట్‌లో కనీసం ఒక్క మహిళ మంత్రి కూడా లేదని, ఇది బీఆర్ఎస్‌కు మహిళలపై ఉన్న చిత్తశుద్ధి అన్నారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే మహిళా బిల్లు పార్లమెంట్‌కు వచ్చిందని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. గతంలో యూపీఏ హయాంలో బిల్లును ప్రవేశపెట్టినప్పటికి దాని మిత్ర పక్షాలే అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే మాటలు కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటో నిరూపిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు.