చేతులు ముడుచుకొని కూర్చోవడానికి మేము సిద్ధంగా లేము.. ప్రభుత్వానికి ఈటల హెచ్చరిక

by Gantepaka Srikanth |
చేతులు ముడుచుకొని కూర్చోవడానికి మేము సిద్ధంగా లేము.. ప్రభుత్వానికి ఈటల హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం(Secunderabad Muthyalamma Temple) వద్ద జరిగిన లాఠీఛార్జీలో బీజేపీ నాయకులు హత్యాయత్నం చేశారని పోలీసులు 109 సెక్షన్ కింద కేసులు పెట్టడం దారుణమని ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) అన్నారు. బీజేపీ నాయకుల అరెస్టులను సైతం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని, కేసులను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా మేము చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

‘మా ప్రజల పట్ల, సంస్థల పట్ల రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి ఇంత ద్వేషభావం ఎందుకో సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రులను దించడానికి మతకల్లోలాలు సృష్టించి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిందూ ప్రజల ఆత్మగౌరవం విశ్వాసాన్ని కాపాడడంలో విఫలమైంది. దుర్మార్గులను కట్టడం చేయటంలో విఫలమైంది. ఎంఐఎం పార్టీ కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి సమాజ హితం కోసం ప్రయత్నం చేయాలి లేదంటే సమాజం, చరిత్ర క్షమించదు. పోలీసులతోనే అన్ని కట్టడం చేస్తాను అంటే అది వెర్రిబాగులతనం అవుతుంది’ అని ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed