- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధాన్యం కొనుగోలులో జాప్యమెందుకు..? సర్కార్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యమెందుకు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఈమేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పైడి రాకేష్ రెడ్డి కలిశారు. రైతు సమస్యలు, పంట కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని, వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని వారు వినతిలో పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులవుతున్నా ఇంకా కొనుగోలులో జాప్యమవుతుండడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత వల్ల కొన్ని చోట్ల రైతులు ధాన్యం తెచ్చి నెలరోజులవుతున్నా తూకం వేయకపోవడం దారుణమన్నారు.
అకాల వర్షాల వల్ల కొన్ని చోట్ల కల్లాల్లోనే ధాన్యం తడిసిపోగా, కొనుగోలు కేంద్రాల్లోనూ వర్షాలకు ధాన్యం తడిసిపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడమే దీనిక కారణమని సీఎంకు వివరించారు. ధాన్యం కాంటా కోసం కోనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు వారాల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వినతిలో పేర్కొన్నారు. కాంటా అయిన ధాన్యాన్ని లారీల కొరతవల్ల మిల్లులకు తరలించకపోవడం, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తేమ పేరుతో తూకం వేయకుండా తిరస్కరించడం, తేమ, తరుగు పేరుతో బస్తాకు నాలుగు కిలోలు కోతపెట్టడమంటే మిల్లర్లు రైతులను దోచుకోవడమేనని సీఎంకు వివరించారు. ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారం కోసం అన్నదాతలు రోడ్లెక్కడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా వారు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలరోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు.
మంత్రులు పట్టించుకోకపోవడం మరీ దారుణమన్నారు. ఇకనైనా ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని 17 శాతం తేమ నిబంధన విధించకుండా కొనుగోలు చేయాలని, తేమ, తరుగు పేరుతో బస్తాకు నాలుగైదు కిలోల మేరకు కోత విధించకూడదని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు క్వింటాలు వరికి రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున ఇచ్చిన హామీ మేరకు రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు వెంటనే చెల్లించాలని, ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని వినతిలో పేర్కొన్నారు.