రెండేళ్లైనా ఆ 600 బెడ్రూం ఇండ్లు పూర్తి కాలేదు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

by Javid Pasha |
రెండేళ్లైనా ఆ 600 బెడ్రూం ఇండ్లు పూర్తి కాలేదు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిర్మల్ జిల్లాలో ని కౌట్ల మండలంలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను బీజేపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 2021 జూన్ లో శంకుస్థాపన చేసిన 600 బెడ్రూం ఇండ్లు ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. వంపు ప్రాంతంలో ఇళ్ళు నిర్మాణం చేపట్టడంతో కింద అంతస్తు వరకు నీళ్ళు వస్తున్నాయి అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story