- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలి: బీజేపీ నేత సంగప్ప
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంమంత్రి రాష్ట్రానికి రూ. 2.50 లక్షల కోట్లు ఇచ్చినట్లు నిరూపిస్తే మంత్రి కేటీఆర్ తన పదవికి రాజీనామా చేస్తానన్నారని, ఆ మాటకు ఆయన కట్టుబడి సిద్ధంగా ఉండాలని బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. షాడో సీఎం, మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ ఘటనను డైవర్ట్ చేసేందుకు ఇలాంటి కామెంట్స్చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవానికి అమిత్ షా ప్రకటించిన దానికంటే ఎక్కువ నిధులు తెలంగాణకు ఇచ్చారన్నారు. కేటీఆర్ సవాలును తాము స్వీకరిస్తున్నామని, నిధుల అంశంలో తమతో చర్చకు కేటీఆర్ వచ్చినా, ఆయన తండ్రి కేసీఆర్ వచ్చినా లేక ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వచ్చినా తాము సిద్ధమేనని పేర్కొన్నారు. 8 ఏండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దొంగతనాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.
కేటీఆర్ ట్వీట్ చేస్తే అత్యాచార ఘటనలో పోలీసులు ముందడుగు వేయలేదని, ఆ ట్వీట్ కు కూడా మూడు రోజుల సమయం పట్టిందన్నారు. ఎందుకంటే ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు నిందితుడిగా ఉన్న కారణంగా ఓవైసీ అనుమతి తీసుకేనేందుకు ఆయన ఇంత సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సమయానికి వేతనాలు అందడంలేదని, అలాంటిది కర్ణాటక రాష్ట్రానికి కేవలం ఒక్క పత్రికకే కోటిన్నర విలువ చేసే యాడ్ ను ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవ్వడంపై సంగప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. ముద్ర లోన్ కింద కేంద్రం రాష్ట్రానికి రూ.43 వేల కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్ష కోట్లు కేవలం జాతీయ రహదారులకే కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు. ఈ నిధులన్నీ కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి వచ్చాయా అని సంగప్ప ఫైరయ్యారు. ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరారు.