గవర్నర్‌కు బీజేపీ నేత రఘునందన్ రావు ఫిర్యాదు (వీడియో)

by GSrikanth |   ( Updated:2024-05-31 07:30:48.0  )
గవర్నర్‌కు బీజేపీ నేత రఘునందన్ రావు ఫిర్యాదు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. ఎన్నికలకు ముందు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన వెంకటయ్యను గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించిందని, అతని భార్య సర్పంచ్‌గా కూడా వ్యవహరిస్తోందన్నారు.

ఒక రాజ్యాంగ బద్దమైన పదవిలో బాధ్యతలు తీసుకున్న వెంకటయ్య.. బీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీలో చురుకుగా పాల్గొన్నారని ఇందుకు సంబధించిన పూర్తి సాక్ష్యాధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. అధికార హోదాను దుర్వినియోగానికి పాల్పడిన వెంకటయ్యను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. తన విజ్ఞప్తిపై గవర్నర్ స్పందిస్తూ సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేస్తానని చెప్పినట్లు తెలిపారు.

Advertisement

Next Story