- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి: NVSS ప్రభాకర్
దిశ, తెలంగాణ బ్యూరో: మహానగరంలో కుక్కల దాడి కారణంగా అనేకమంది చనిపోతున్నారని, నైతిక బాధ్యత వహించి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్‌ను అసమర్థ మంత్రి అని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఆయన్ను తొలగించాలన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడులో కమ్యూనిస్టుల సహకారంతో బీఆర్ఎస్ గట్టెక్కిందన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా గెలిచే అవకాశం ఉన్నా మజ్లిస్‌కి మద్దతు ప్రకటించిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్లాలనే ఒప్పందం కుదుర్చకున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ అసెంబ్లీ వేదికగా చెప్పారని, ఇదంతా బీఆర్ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకేనని ప్రభాకర్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి వెళ్లాలని నిర్ణయించాయని, ఇది అనైతికమని ఆయన పేర్కొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ ఒకే నాణానికి ఉన్న గుర్తులనేది తేలిపోయిందన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మజ్లిస్‌కు మద్దతు ఇవ్వడంపై ఆలోచించుకోవాలన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్‌కు మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు చెప్పారు.