- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులు అడ్డుకున్నా.. సభలు సక్సెస్: కాసం
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగానే ఇతర రాష్ట్రాలకూ ఆ స్కామ్‌ను విస్తరించేందుకే బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్నట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆయన ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 8 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పూర్తి చేసినట్టు, మిగిలిన వాటిని కూడా రేపటిలోపు కంప్లీట్ చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రచరిత్రలోనే ఇన్ని మీటింగ్ లు నిర్వహించిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించనుందని వ్యక్తంచేశారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ కంచుకోటలైన సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో 80 శాతం స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ సక్సెస్ అయ్యాయన్నారు. సభలు వద్దంటూ బీజేపీ నేతలను పోలీసులు నిత్యం అడ్డుకుంటున్నారని, దాడులు, అడ్డంకులు అధిగమించి టార్గెట్ పూర్తి చేస్తామని స్పష్టంచేశారు.