- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కేసీఆర్కు జూటా నెంబర్ వన్ అవార్డు ఇవ్వాలి'
దిశ, కుత్బుల్లాపూర్ బృందం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జూటా నెంబర్ 1 అవార్డు ఇవ్వాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడుత ప్రారంభం సందర్భంగా కుత్బుల్లాపూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న డీకే అరుణ మాట్లాడుతూ... కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను దోచుకుని దాచుకున్నారని విమర్శించారు. కేసీఆర్కు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న భారత్ జోడో యాత్రపై డీకే అరుణ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ముందు కాంగ్రెస్లో ఉన్న కుంపటి రాజకీయాలను చక్కదిద్దుకోవాలని, ఆ తర్వాత భారత్ జోడో యాత్రను చేపట్టాలని సూచించారు. ఎవరెన్ని యాత్రలు చేపట్టిన దేశంలో ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్ చోడో యాత్రగా రాహుల్ గాంధీ యాత్ర ఉండబోతుంది అని అన్నారు.