'KCRపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తా'

by Nagaya |   ( Updated:19 Aug 2022 7:05 AM  )
KCRపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్సీ ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. కేసీఆర్‌పై అనుచిత పదజాలం వాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ చేయాల్సింది పాదయాత్ర కాదు.. తెలంగాణకు నిధుల కోసం కేంద్రంపై దండయాత్ర చేయాలని హితవు పలికారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తలచుకుంటే బండి పాదయాత్ర ముందుకు సాగదు జాగ్రత్త అని హెచ్చరించారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా మతాల మధ్య చిచ్చు పెట్టేలా బండి యత్నిస్తున్నారని, దమ్ముంటే సంక్షేమంపై మాట్లాడాలని బండికి సవాల్ చేశారు.

నియోజవర్గంలో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత.. ఏం జరగాలన్నా ఆయన పర్మిషన్ కావాల్సిందే..

Advertisement

Next Story

Most Viewed