Cabinet Meeting: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. భవనాలు, లేఅవుట్ల అనుమతులు మున్సిపాటీలకు

by Shiva |   ( Updated:2025-01-02 06:56:09.0  )
Cabinet Meeting: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. భవనాలు, లేఅవుట్ల అనుమతులు మున్సిపాటీలకు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానందర్, ప్రభుత్వం సలహాదారులు హాజరయ్యారు. ఈ భేటీలో భాగంగా రాజధాని అమరావతిలో రెండు ఇంజనీరింగ్‌ కాలేజీల నిర్మాణ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా భవనాలు, లేఅవుట్‌ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ఆర్డినెన్స్‌,‌ సవరణ ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక తిరుపతి ఈఎస్ఐ (ESI) ఆసుపత్రి పడకలను 100కు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

కాగా, ఇదే సమావేశంలో ఎస్‌ఐపీబీ (SIPB) అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ అమోదం తెలుప‌నుంది. ఈ పెట్టుబడుతో సుమారుగా 2,63,411 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. నెల్లూరు (Nellore) జిల్లా రామయ్యపట్నం (Ramaiahpatnam)లో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ (BPCL) భారీ రిఫైనరీ ఏర్పాటుకు అమోద ముద్ర వేయనున్నారు. దీంతో మరో 2,400 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.


Also Read...

Tirumala : మరోసారి శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం

Advertisement

Next Story

Most Viewed