- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవంత్ రెడ్డి ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు..ధ్వజమెత్తిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ 400 స్థానాల్లో విజయం సాధిస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ పదే పదే రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తున్నారు. కశ్మిర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 70 ఏళ్లుగా రిజర్వేషన్లకు నోచుకోలేకపోయిందని అలాంటి వారికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది మోడీ ప్రభుత్వం అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లే పాక్ ఆధీనంలోకి పీవోకే వెళ్లిందని ఆరోపించారు. నర నరాన హిందూ వ్యతిరేకతను నింపుకుని దేవీ దేవతలను అవమానించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతృష్టికర విధానం చేరుకుందని ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అయోధ్య నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలను బీజేపీ నెరవేరుస్తోందని అన్నారు. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ లో పెట్టి భారతరత్నతో గౌరవించామని, నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. రూ.350 కోట్లతో స్పూర్తి, దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ సేవలు, త్యాగాలు భావితరాలకు అందించేందుకు యత్నిస్తున్నామన్నారు.