- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : Bandi Sanjay
దిశ, ముధోల్ : సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమయిందని తాము అధికారంలోకి వచ్చాక అన్ని విధాలుగా ఆదుకుంటామని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర కుంటాల మండలం అంబకంటి గ్రామంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అంబకంటి తండాకు చెందిన మహిళా రైతు శ్యాముకా బాయి బండి సంజయ్ ను కలిసి సమస్యలను చెప్పుకుంది. తన భర్త రాథోడ్ రవీందర్ ఈ ఏడాది జూలై 25న మరణించాడని, తనకు 2 ఎకరాల పట్టా భూమి ఉన్నప్పటికీ రైతు బీమా రాలేదన్నారు. పట్టా భూమి కలిగి ఉన్నప్పటికీ ఆన్లైన్లో మాత్రం మా భూమిని చూపించడం లేదన్నారు.
తన భర్త చనిపోయి 5 నెలలు గడిచినా ప్రభుత్వం సాయం చేయలేదన్నారు. రైతుబంధు కూడా తమకు రావడంతో లేదని వాపోయారు. అధికారులు, ఎమ్మెల్యే చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. రైతుబంధు, రైతు బీమా వచ్చేలా చూడాలని బండిని కోరారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజల తరపున బీజేపీ పోరాడుతుందన్నారు. మీకు రైతు బీమా, రైతు బంధు, పంట నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోవతే, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా రైతు బీమా, రైతు బంధు, పంట నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తో తండా వాసులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చారు.