ఒవైసీ.. కొంచమైనా సిగ్గు- మానం తెచ్చుకో! నీకు ఓటు వేసిందని పాలస్తీనీయులా?: బీజేపీ

by Ramesh N |
ఒవైసీ.. కొంచమైనా సిగ్గు- మానం తెచ్చుకో! నీకు ఓటు వేసిందని పాలస్తీనీయులా?: బీజేపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో 18వ లోక్‌సభ కొలుదీరిన సందర్భంగా ఎంపీల ప్రమాణ స్వీకారం రెండు రోజు కొనసాగుతోంది. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ప్రమాణ స్వీకారంపై లోక్ సభలో గందరగోళం ఏర్పడింది. ప్రమాణస్వీకారం చేసేందుకు స్టేజీ వైపు వెళ్తుండగా అధికార పక్షం కొందరు నేతలు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన ఓవైసీ చివర్లో జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత పార్లమెంటులో జై పాలస్తీనా అని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ ట్విట్టర్ వేదికగా ఓవైసీ పై తీవ్ర విమర్శలు చేసింది.

‘కన్న తల్లికి గంజి కూడా పొయ్యనోడు, పినతల్లికి పరమాన్నం వండి పెట్టిండట. భారతమాతకు జై కొట్టడం చేతకాదు.. జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టడానికి చేతులురావు.. కానీ నీ మతంతో మాత్రమే ముడిపడి ఉన్నందున పాలస్తీనాకు జై కొట్టావు, నువ్వు ఎంపీ అవ్వడానికి ఓటు వేసింది భారతీయులా? పాలస్తీనీయులా?? మనిషివి మాత్రం అడ్డం పొడవు పెరిగితే సరిపోదు ఒవైసీ.. కొంచమైనా సిగ్గు - మానం తెచ్చుకో’ అని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story