బీజేపీ, కాంగ్రెస్.. మధ్యలో బెంజ్!.. బీజేపీ నేత వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ ఫైర్

by Prasad Jukanti |
బీజేపీ, కాంగ్రెస్.. మధ్యలో బెంజ్!.. బీజేపీ నేత వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఈ క్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా‌దాస్ మున్షీపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఓ టీవీ చానెల్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాబోయే ఎంపీ ఎన్నికల్లో టికెట్ కోసం దీపాదాస్‌కు కాంగ్రెస్ నేత ఒకరు మెర్సిడెస్ బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారని ఆరోపించారు. ఏ తేదీన, ఏ ప్లేస్‌లో ఇచ్చారో అన్నింటికీ తన వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రభాకర్ సీరియస్ కామెంట్స్ చేశారు. దీంతో కాంగ్రెస్ వైపు నుంచి ఘాటు రియాక్షన్లు వస్తున్నాయి.

ఆధారాలు బయటపెట్టు..

ప్రభాకర్ వ్యాఖ్యలు బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని, చౌకబారు ఆరోపణలని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాత పాల్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు బయట పెట్టాలని, లేదంటే వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.

నాడు మాణిక్కం నేడు దీపాదాస్..

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలే టార్గెట్‌గా ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పించడం హాట్ టాపిక్‌గా మారుతున్నది. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్ డబ్బులకు పీసీసీ పదవి అమ్ముకున్నారని బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై ఆయన లీగల్ యాక్షన్‌కు దిగారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి మధురై కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. తనపై చేసిన ఆరోపణలకు గాను కేటీఆర్‌కు సైతం మాణిక్కం లీగల్ నోటీసులు పంపించారు. ఇంతలోనే బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ దీపాదాస్ టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisement

Next Story