ముఖ్యమంత్రి సమస్యలు సృష్టించడం సిగ్గుచేటు: Bandi Sanjay Kumar

by GSrikanth |   ( Updated:2022-08-25 05:20:44.0  )
ముఖ్యమంత్రి సమస్యలు సృష్టించడం సిగ్గుచేటు: Bandi Sanjay Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో నెలకొన్న పరిస్థితులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎమ్ఐఎం పార్టీలు కలిసి మత విద్వేశాలు రెచ్చగొడుతున్నాయని అన్నారు. దేశంలోని అన్ని మతాలు బాగుండాలని బీజేపీ కోరుకుంటోందని తెలిపారు. తెలంగాణను శ్రీలంకలా మార్చాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి.. సమస్యలు సృష్టించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గతరెండ్రోజులుగా మత విద్వేశాలు రెచ్చగొడుతూ.. ఎమ్ఐఎమ్ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తోందని అన్నారు. ఎమ్ఐఎం చేస్తోన్న ఈ అల్లర్లకు టీఆర్ఎస్ పరోక్షంగా మద్దతు ఇస్తోందని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిషృత ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్, ఎమ్ఐఎం, కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో యువకులు రోడ్లపైకి వచ్చిన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed