- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాతబస్తీలో హిందువులను హింసిస్తుంటే అండగా ఉన్నాడు: బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఐఎం నాయకుల సింహ స్వప్నం ఆలె నరేంద్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొనియాడారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆలె నరేంద్ర వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర స్ఫూర్తితో ముందుకు నడవాలని పార్టీ నేతలకు సూచించారు. పాతబస్తీలో హిందువులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉన్నానంటూ అభయమిచ్చిన వ్యక్తి నరేంద్ర అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 18 నెలల పాటు జైలు జీవితం గడిపారని బండి గుర్తు చేశారు. అయోధ్య రామ మందిరం ఏర్పాటు కోసం పాటుపడ్డారన్నారు.
పాతబస్తీలో ఓవైసీ సోదరులు హిందువులను ఇబ్బందులు పెడుతుంటే వారికీ అండగా నిలబడిన వ్యక్తి నరేంద్ర అని కొనియాడారు. తెలంగాణ కోసం ఆయన స్థాపించిన పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారని, ఆ సమయంలోనే నరేంద్ర.. కేసీఆర్ నియంతృత్వాన్ని బయటపెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఎంఐఎంతో కేసీఆర్ సావాసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆదివాసీల ఆరాధ్య దైవం రాంజీగోండు, కొమురం భీం వంటి నేతల జీవిత చరిత్రను సైతం పాఠ్యంశాల్లో చేర్చేందుకు క్రుషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ సహా పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొని నరేంద్రకు నివాళులర్పించారు.
కేసీఆర్ ఇదిగో శాలువా..
పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే ప్రధాని మోడీ చేతుల మీదుగా సన్మానం చేయిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా.. మోడీ సభకు ముఖ్యమంత్రి రాకపోవడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా కేసీఆర్ వస్తే సన్మానించేందుకు తీసుకొచ్చిన శాలువాను బండి సంజయ్ మీడియాకు చూపించారు. మోడీ చేతుల మీదుగా సన్మానం చేయించేందుకు తీసుకొచ్చిన శాలువా ఇదేనంటూ బండి సంజయ్ వెల్లడించారు. కాగా మోడీని ఎదుర్కోలేక కేసీఆర్ తోక ముడిచారని బండి సంజయ్ విమర్శలు చేశారు.