- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘రజాకార్‌ను తరిమికొడదాం’.. అసదుద్దీన్ ఒవైసీపై BJP అభ్యర్థి మాధవీలత సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఒవైసీని రజాకార్‌తో పోల్చారు. ఒక రజాకార్ వల్ల పాతబస్తీ హైదరాబాద్ నాశనం అవుతోందని మండిపడ్డారు. పాతబస్తీ రజాకార్‌ను ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రజాకార్ల వల్ల ఇప్పటికి హిందూ ఆడపిల్లల్ని అమ్ముతున్నారని ఆరోపించారు. మతం, ఆచారాల పేరుతో స్వేచ్ఛ లేకుండా ముస్లిం ఆడపిల్లల్ని తొక్కేస్తున్నారని ఫైర్ అయ్యారు. నేను రజాకార్‌ను అని చెప్పుకునే వ్యక్తిని పాతబస్తీ హిందువులు ఆదరించాలా అని ప్రశ్నించారు.
కాగా, తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. హైదరాబాద్ గడ్డపైన కాషాయ జెండా ఎగరేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఎంఐఎం చీఫ్, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్‌ను ఢీకొట్టేందుకు ఈ సారి మాధవీలతను బరిలోకి దించింది. ప్రముఖ విరంచి హాస్పిటల్ చైర్ పర్సన్, ఓల్డ్ సిటీలో సేవా కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధవీలతే ఒవైసీకి గట్టి పోటీ ఇవ్వగలదని భావించి.. వ్యుహత్మకంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ టికెట్‌ను ఆమెకు కేటాయించారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ ఖరారైన నాటి నుండి మాధవీలత స్పీడ్ పెంచారు. నిత్యం కార్యకర్తలతో భేటీ అవుతూ.. సమయం దొరికినప్పుడల్లా ఒవైసీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పార్లమెంట్ పోటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.