- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP: ప్రారంభమైన "బీజేపీ మూసీ నిద్ర".. తులసీరామ్ నగర్‌లో కేంద్రమంత్రి బస
దిశ, వెడ్ డెస్క్: మూసీ పరివాహక ప్రాంతాల్లో(Moosi Catchment Areas) "బీజేపీ మూసీ నిద్ర"("BJP Moosi Nidra") కార్యక్రమం ప్రారంభమైంది(Started). ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు(BJP Leaders) మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అనంతరం మూసీ నది వెంట 21 ప్రాంతాల్లో వారు రాత్రి బస చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గం తులసీ రామ్ నగర్(Tulsiram Nagar) లోని మూసీ ప్రాంత ప్రజలను కలిసి, వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.
అనంతరం ఈ రాత్రి తులసీరామ్ నగర్ లోనే కిషన్ రెడ్డి బస చేయనున్నారు. ఆయన వెంట బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ(Rani Rudrama) సహా ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మూసీ ప్రక్షాళన పై మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మూసీపై రాద్ధాంతం చేస్తున్నారని, మూసీ ప్రాంత ప్రజల కష్టాలు తెలియాలంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నాయకులు బస చేయాలని సూచించారు. ఈ మాటలను ఛాలెంజ్(Challenge) గా తీసుకున్న బీజేపీ లీడర్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒక రోజు రాత్రి బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు.