- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
BJP: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్(Moosi Riverfront Development) కు బీజేపీ(BJP) వ్యతిరేకం కాదని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ(Mahabubnagar BJP MP DK Aruna) అన్నారు. ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె మూసీ ప్రక్షాళనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నీటిని మంచి నీటిగా మారుస్తామన్నందుకు తాము వ్యతిరేకం కాదని, మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల ఖర్చు పెట్టాలనే ఆలోచనను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని, దీని పేరుతో పేదల ఇండ్లను కూలగొట్టడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని అన్నారు.
మూసీ నది వెంట నివసిస్తున్న వారిని నిరాశ్రయులను చేయకుండా రీటైనింగ్ వాల్ కట్టి ప్రక్షాళన చేయవచ్చని, దీనికి కూడా లక్షల కోట్లు అవసరం లేదని తెలిపారు. అసలు డీపీఆర్(DPR) లేకుండా ఇళ్లను ముందే ఎందుకు కూలగొడుతున్నారని మండిపడ్డారు. ఏ డీపీఆర్ తయారు చేయకుండా లక్షన్నర కోట్లు(One And A Half Lakh Crores) అని కాంగ్రెస్ నాయకులే(Congress Leaders) చెబుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కాళేశ్వరం(Kaleshwaram) పేరులో దోచుకున్నట్లే.. వీళ్లు కూడా మూసీ పేరుతో దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ లక్షల కోట్ల దోపిడీ యత్నాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని అరుణ వ్యాఖ్యానించారు.