బీజేపీ, టీడీపీ మళ్లీ దగ్గరవుతున్నాయా ?

by Seetharam |
బీజేపీ, టీడీపీ మళ్లీ దగ్గరవుతున్నాయా ?
X

దిశ,వెబ్‌డెస్క్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వచ్చే తెలంగాణ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే బీజేపీ తపనపడుతోంది. తెలంగాణలో గెలుపు బలం చాలని బీజేపీకి కొన్ని విషయాలు సవాలుగా మారాయి. పట్టణ ప్రాంతాల్లో పట్టు బిగించిన బీజేపీ ఇప్పుడు గ్రామస్థాయిలో పార్టీకి కేడర్‌ను పెంచుకోవాలని యోచిస్తోంది. అయితే ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా..? లేదా ? అనేది వేచి చూడాల్సిందే.. ఇప్పటికిప్పుడు తమ క్యాడెర్‌ను పెంచుకునే కంటే ఇప్పటికే గ్రామస్థాయిలో కేడర్ కలిగిన ఏదైనా పార్టీతో కలిసి పోటీచేస్తే మంచి ఫలితాలుంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచరం!

తెలంగాణలో గత జీహెచ్ఎంసీ ఎన్సికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు జిల్లా కేంద్రాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టు కోసం నడుం బిగిస్తోంది. దీంతో ఇప్పటికే రూరల్‌ ఏరియాలలో కేడర్ ఉన్న పార్టీలతో జత కట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆ పార్టీ టీడీపీనే ఎందుకు కాకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై కొందరు రాజకీయ విశ్లేషకులు పలుసార్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ మళ్లీ దగ్గరయ్యే అవకాశాలున్నాయా..? ఒకవేళ దగ్గరయితే వచ్చే ఫలితంమేంటనేది వేచి చూడాల్సిందే.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అవి రెండు కలిసి పోటీచేస్తే కలిసొచ్చే అంశాలపై ఆ పార్టీ ఆరా తీస్తోందన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది!

Next Story