- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Maheshwar Reddy: మేఘా కృష్ణారెడ్డి ఒక క్రిమినల్.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి
దిశ, వెబ్‌డెస్క్: మేఘా కృష్ణారెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఏలేటి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పెత్తనం మాత్రం మేఘాకృష్ణారెడ్డిదే అన్నారు. గవర్నమెంట్ మారినా కాంట్రాక్టర్ మారడా? అని ప్రశ్నించారు. నాసిరకం పనులు చేసిన ఆయనకే మళ్లీ కాంట్రాక్టులు ఇస్తున్నారని అన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సుంకిశాల బ్యారేజ్ కూలి పది రోజులు అయినా ప్రభుత్వం దృష్టికి రాలేదా? అని అడిగారు. ఒకవేళ ప్రభుత్వం దృష్టికి వచ్చినా.. మేఘా కృష్ణారెడ్డిని కాపాడుకునేందుకు అసలు విషయాన్ని దాచారా? అని మండిపడ్డారు.
నాసిరకం పనులు చేసి గుత్తేదార్లను కాపాడుతున్నాడని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మేఘాను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో సుంకిశాల అంచనా వ్యయం రూ.800 కోట్లు అని.. కానీ, మేఘా కృష్ణారెడ్డి దానిని రూ.4 వేల కోట్లకు పెంచారని కీలక ఆరోపణలు చేశారు. క్రిమినల్ కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మేఘా మీద చర్యలు ఎందుకు లేవు? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐకి సిఫార్సు చేయడం లేదని అడిగారు. దాని మీద రిటైర్డ్ జడ్జి కమిటీ వేశారని గుర్తుచేశారు. జడ్జికి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఆయనకి కీలకమైన ఫైల్స్ ఇవ్వడం లేదు.
కమిటీని ప్రభుత్వమే నీరు గార్చే పనిలో ఉందని ఏలేటి అనుమానం వ్యక్తం చేశారు. కొడంగల్ పనులు కూడా మేఘాకి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారని మాకు సమాచారం ఉందని ఆరోపించారు. మేఘా మీద ఉన్న ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీకి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మేఘా కృష్ణారెడ్డే సయోధ్య కుదిర్చి సెటిల్మెంట్‌లు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాది ఒక క్రిమినల్ కంపెనీ అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు ఎక్కడ సబ్మిట్ చేయాలంటే అక్కడ సబ్మిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.