- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూపు- 2 అభ్యర్థి ప్రవళిక సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన గ్రూప్ - 2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాం రాథోడ్ బెయిల్ పిటిషన్ విషయంలో పోలీసులు యూటర్న్ తీసుకున్నారు. శివరాం రాథోడ్‌పై చిక్కడపల్లి పోలీసులు సెషన్ కోర్టులో చేసిన అప్పీల్‌ను తాజాగా విత్ డ్రా చేసుకున్నారు. శివరాం రాథోడ్ బెయిల్‌ను క్యాన్సిల్ చేయాలంటూ గతంలో పోలీసులు కోర్టును ఆశ్రయించారు. పోలీసుల పిటిషన్‌తో కోర్టు ఇప్పటికే శివరాం రాథోడ్‌కు కోర్టు నోటీసులు సైతం జారీ చేసింది. ఇంతలో పోలీసులు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
దీంతో ప్రవళిక కేసులో అసలేం జరుగుతోందనే సందేహాలు వ్యక్తం అవుతున్నది. కాగా, పోటీ పరీక్షల వాయిదాలతోనే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. కానీ, పోలీసులు మాత్రం ఆమె చావుకు ప్రేమ వ్యవహారమే రీజన్ అని తేల్చారు. ఈ క్రమంలో ప్రవళికను మోసం చేసింది ఆమె ప్రియుడి శివరాం రాథోడ్ అంటూ అతడిని అరెస్ట్ చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ క్యాన్సిల్ చేయాలని అప్పీల్ చేసిన పోలీసులు తాజాగా తమ అప్పీల్ ను వెనక్కి తీసుకోవడంతో ఎన్నికల వేళ ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.