ఇంటర్ విద్యార్థి సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కన్నీళ్లు తెప్పిస్తోన్న ఫ్రెండ్‌‌కు రాసిన లెటర్

by GSrikanth |   ( Updated:2024-03-09 14:22:40.0  )
ఇంటర్ విద్యార్థి సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కన్నీళ్లు తెప్పిస్తోన్న ఫ్రెండ్‌‌కు రాసిన లెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండ - భీమారంలోని శివానీ జూనియర్ కాలేజీ విద్యార్థిని సూసైడ్ వ్యవహారం రాష్ట్రంలో కలకల రేపిన సంగతి తెలిసిందే. శుక్రవారం కాలేజీ భవనంపై నుంచి దూకి సాహిత్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు సాహిత్య తన ఫ్రెండ్‌కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖను కేయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అందులో స్నేహితురాలిని సంబోధిస్తూ.. ‘‘నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు ఐయామ్ సారీ!.. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరూ నిన్ను విడిచి పెట్టలేరే.. యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. త్రీ మంత్స్ నుంచి నాకు అసలు మంచిగ అనిపిస్తలేదు. నా మైండ్ అంతా చనిపొమ్మంటోంది. దాని వల్ల అసలు చదువుకోబుద్ది కావడం లేదు. అయినా చదివి ఎగ్జామ్స్ రాసినా.. బోర్డు ఎగ్జామ్స్ ఫస్ట్ సాన్‌స్క్రిట్ పేపర్లో ఒక్క బిట్ రాయలేదే.. ఇంగ్లిష్ ఓకే. బోటనీ అసలు మంచిగా రాయలేదు. ఆన్సర్స్ అన్నీ వచ్చినా కూడా ఏమీ మంచిగా రాయలేదే.. ఇవన్నీ నీకు చెప్పలేదు’’ అని రాసి ఉంది.

Advertisement

Next Story