- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRSకు బిగ్ షాక్! కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే
దిశ బ్యూరో, మహబూబ్‌నగర్/అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం శుక్రవారం బీఆర్ఎస్‌ను వీడారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార బీఆర్‌ఎస్‌కు షాకిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి అందరితో పాటుగా డాక్టర్ అబ్రహంకు కూడా అలంపూర్ నుండి పోటీ చేసేందుకు టికెట్ కేటాయించినట్లు ప్రకటించారు. ఇటీవలే పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎంపికైన చల్ల వెంకట్రామిరెడ్డి తన ఆధిపత్యాన్ని చాటేందుకు డాక్టర్ అబ్రహంకు బి ఫామ్ దక్కకుండా చేయడమే కాకుండా.. ఆయన వ్యక్తిగత సహాయకునిగా ఉండే విజయుడికి టికెట్ దక్కించుకున్నారు.
దీంతో అబ్రహం తీవ్ర నిరాశకు గురయ్యారు. నామినేషన్‌కు ఒకరోజు ముందు విజయుడికి టికెట్ ప్రకటించడంతో అప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేసిన అబ్రహం ప్రస్తుతానికి తాను మౌనంగా ఉండడం తప్ప రాజకీయంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు. అప్పటినుండి మౌనంగా ఉన్న అబ్రహం ఇటీవల అలంపూర్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు పలువురు ముఖ్య నేతలు ఆహ్వానించే ప్రయత్నాలు చేసిన ఆయన వెళ్ళలేదు.
రిజర్వు నియోజకవర్గంలో పెత్తందార్ల ఆధిపత్యం ఏమిటి అని అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోవడంతో ఆయన తన అనుచరులతో వరుసగా సమాజంలో చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ బయలుదేరి వెళ్లి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అబ్రహంకు కాకుంటే టికెట్టు తన కుమారునికి ఇవ్వాలని కోరిన కేంద్రంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న మంద జగన్నాథం డిమాండ్‌ను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదు.
దీంతో ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చల్లా తీరు, అధిష్టానం నిర్ణయంతో విసుగు ఎత్తిన పలువురు ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం డాక్టర్ అబ్రహం సైతం మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కొత్తకోట ప్రకాష్ రెడ్డి తదితరులతో కలిసి హైదరాబాద్ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అలంపూర్ నియోజకవర్గ అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లయింది.