ఎన్నికల వేళ టీ-బీజేపీకి బిగ్ షాక్! కీలక నేత రాజీనామా

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-22 07:12:30.0  )
ఎన్నికల వేళ టీ-బీజేపీకి బిగ్ షాక్! కీలక నేత రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. వనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన టీఎస్ ఆర్టీసీ టీఎంయూ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీ-బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పంపారు. వనపర్తి అసెంబ్లీ స్థానం ఇచ్చినట్టే ఇచ్చి చివరినిమిషంలో అనుగ్న రెడ్డికి బీజేపీ అధిష్టానం కన్ఫార్మ్ చేసింది. వనపర్తి అసెంబ్లీ స్థానం దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసహనంలో ఉన్నారు. అశ్వత్థామ రెడ్డి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

Advertisement

Next Story