Liquor: బోనాల వేళ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. రెండ్రోజులు వైన్ షాపులు బంద్

by Gantepaka Srikanth |
Liquor: బోనాల వేళ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. రెండ్రోజులు వైన్ షాపులు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బోనాల జాతర అంటే ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఆలయాల వద్ద మైకుల మోతలు, ఇంట్లో మటన్ ఘుమఘుమలతో అంతా సందడి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పండుగ వాతావరణం అబ్బురపరుస్తుంది. బోనాల జాతర అంటే సుక్కా, ముక్కా తప్పనిసరి అయిపోయింది. అయితే, అలాంటి బోనాల వేళ సర్కార్ మద్యం ప్రియులకు భారీ షాకిచ్చింది. హైదరాబాద్ మహా నగరంలో ఆదివారం(జూలై 28), సోమవారం(జూలై 29) రోజున మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వైన్ షాపులే కాదు రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లన్నీ మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రెండ్రోజుల పాటు వైన్ షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయబడతాయని సీపీ పేర్కొన్నారు.

Advertisement

Next Story