ఆ దేశం వెళ్లే భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్

by Sathputhe Rajesh |
ఆ దేశం వెళ్లే భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ స్టూడెంట్స్ కి ఆస్ట్రేలియా యూనివర్సిటీలు బిగ్ షాక్ ఇచ్చాయి. మన దేశంలోని ఉత్తరాఖండ్, గుజరాత్, యూపీ, పంజాబ్, హర్యాణా, జమ్ముకశ్మీర్ లకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై విధించిన తాత్కాలిక నిషేధంతో విద్యార్థులకు చిక్కులు తప్పడం లేదు. ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే వీసా దరఖాస్తులు స్వీకరించవద్దని ఫెడరేషన్ యూనివర్సిటీ, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఏజెంట్లకు కీలక సూచనలు జారీ చేశాయి. ఇప్పటికే ఈ మేరకు మెయిల్స్ పంపినట్లు అక్కడి ఫెడరేషన్ యూనివర్సిటీ తెలిపింది.

ఈ రాష్ట్రాల విద్యార్థుల దరఖాస్తులు చాలా మేరకు మోసపూరితంగా ఉన్నాయని ఆస్ట్రేలియా హోం శాఖ తెలపడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అక్కడి అధికారులు తెలిపారు. భారత్ నుంచి వచ్చిన వీసా అప్లికేషన్స్ లో గత పదేళ్లలో లేనంతగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 25 శాతం మోసపూరితంగా ఉన్నాయని ఆస్ట్రేలియా అధికార వర్గాలు తెలిపాయి. కనీసం మరో రెండు నెలలు ఈ నిషేధం కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story