BRS మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్ షాక్

by Rajesh |   ( Updated:2024-01-17 08:50:23.0  )
BRS మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా భవన్ ఎదుట బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహిల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఎమ్మెల్యే షకీల్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. సీఐని మభ్యపెట్టినందుకు షకీల్‌తో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. షకీల్ కుమారుడు సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అర్బాజ్, సోహెల్‌ను రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్, సాహిల్‌‌తో పాటు మరో ఇద్దరిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్‌లో ఉన్న సాహిల్‌ను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed