- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్తో భారత్‌లో భారీ రాజకీయ మార్పులు: NRI మహేష్ బిగాల
దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికాలోని న్యూజెర్సీలో ఎన్నారైలు శ్రీనివాస్ జక్కిరెడ్డి, భాస్కర్ పిన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ.. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి ఏ రాష్ట్రంలో జరగడం లేదన్నారు. డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం దేశానికే తలమానికంగా మారిందన్నారు. బీఆర్‌ఎస్‌తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు.
భారత్‌లో బీఆర్‌ఎస్‌తో భారీ రాజకీయ మార్పులు రానున్నాయని, కేసీఆర్ వంటి నాయకుడు దేశానికి అవసరమన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి దేశానికే ఆదర్శమన్నారు. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాష్ట్రాల ఎన్నారైలను ఏకం చేస్తామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యూఎస్‌ఏ నాయకులు శ్రీనివాస్ జక్కిరెడ్డి, భాస్కర్ పిన్న, శ్రీశైలం గదాసు, కిరణ్ తోట, శ్రీనివాస్ మేలి, ప్రశాంత్, మహేశ్ పాల్గొన్నారు.