- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG News: కొత్తగా పెళ్లైన వారికి భారీ గుడ్‌న్యూస్.. ఆ సర్టిఫికెట్ చూపిస్తే రేషన్ కార్డు పక్కా!
దిశ, వెబ్‌డెస్క్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సాధ్యమైనంత త్వరగా కార్డులు జారీ చేయాలంటూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల డిజైన్లపై పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఆ ప్రక్రియ పూర్తి అవ్వగానే కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఈ క్రమంలోనే సర్కార్ కొత్తగా పెళ్లైన జంటలకు గుడ్ న్యూస్ చెప్పింది.
నవ దంపతులు కుటుంబం నుంచి వేరుపడిన వారు మ్యారేజ్ సర్టిఫికెట్ సమర్పిస్తే వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. కొత్త జంటలు రేషన్ కార్డు కోసం చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాము గుర్తించామని పేర్కొన్నారు. వివాహం చేసుకుని రేషన్ కార్డులో పేర్లు లేని వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ సర్వేను చేపడతామని అన్నారు. వారి అర్హతలను పరిశీలించి ఖచ్చితంగా వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో 89 లక్షల రేషన్ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందజేస్తోంది.