Hot News: బీఆర్ఎస్.. డిఫెన్స్‌ మోడ్..! ‘విలీనం’పై కాంగ్రెస్ Vs బీజేపీ

by Shiva |   ( Updated:2024-08-17 02:32:07.0  )
Hot News: బీఆర్ఎస్.. డిఫెన్స్‌ మోడ్..! ‘విలీనం’పై కాంగ్రెస్ Vs బీజేపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చేస్తోన్న విమర్శ ల మధ్య గులాబీ పార్టీ నలిగిపోతున్నది. రెండు పార్టీలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేక డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లింది. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటీ.. నిజంగానే ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం కానుందా అనే చర్చ బీఆర్ఎస్ కేడర్‌లో కొనసాగుతున్నది.ః

పావుగా మారిన బీఆర్ఎస్

కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతున్న రాజకీయ విమర్శలకు బీఆర్ ఎస్ ఓ పావుగా మారిందనే చర్చ జరుగుతున్నది. ఆ రెండు పా ర్టీలు గులాబీ పార్టీని ఇన్‌డైరెక్టుగా ఎటాక్ చేయడం రోటిన్‌గా మారింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ లీడర్లు కామెంట్ చేయగా, లేదు.. లేదు.. తమ పార్టీలో విలీనం అయ్యే ప్రసక్తి లేదని, కాంగ్రెస్‌లోనే మెర్జ్ అవుతుందని కమలం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీనితో అసలు బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటీ? వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకైనా పార్టీ మనుగడలో ఉం టుందా? అన్న సందేహం గులాబీ లీడర్లలో మొదలైంది. ఇప్పటి కే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో మరికొంత మంది చేరుతారనే చర్చ జోరుగా సాగుతున్నది. ఇలాం టి పరిస్థితుల్లో కమలం పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న ప్రచారంతో కేడర్‌లో మరింత గందరగోళం నెలకొన్నది.

లోక్‌సభ రిజల్ట్స్ నుంచే ప్రచారం

బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం ఈ మధ్య మొదలైంది కాదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రో జుల తరువాత నుంచే వినిపిస్తున్నది. ఆ మధ్య మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర బీజేపీ లీడర్లతో చర్చలు జరిపారని, ఆ సమయంలోనే పార్టీ విలీనం ప్రతిపాదన తెరమీదికి వచ్చిందని తెలుస్తున్నది. కానీ పార్టీని విలీనం చేయడం వల్ల కలిసివచ్చే లాభనష్టాలపై క్లారిటీ లేకపోవడంతోనే గులాబీ బాస్ తుది నిర్ణయం తీసుకోలేదని టాక్ ఉంది. అయితే విలీనం చేయా లా? లేకపోతే కమలం పార్టీతో కలిసి పనిచేయాలా? అనే దానిపై కవితకు బెయిల్ వచ్చిన తరువాత కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

కేసీఆర్ క్లారిటీ కోసం నిరీక్షణ

కాంగ్రెస్, బీజేపీ చేస్తోన్న విలీనం విమర్శలపై కేటీఆర్, హరీశ్ రా వు కౌంటర్ ఇస్తే సరిపోదని, కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్లు పార్టీ కేడర్ నుంచి వస్తున్నాయి. విలీనంపై వస్తోన్న విమర్శలపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. నిజంగానే విలీనం చేసే ఆలోచనలో ఉన్నారా.. లేదా? అనే విషయం ఆయన చెప్పేవరకు క్లారిటీ రాదని పార్టీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. అలా కా కుండా మౌనంగా ఉంటే, జరుగుతోన్న వ్యతిరేక ప్రచారాన్ని విశ్వసించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు విలీనంపై జరుగుతోన్న వ్యతిరేక ప్రచారంపై ఎలా స్పందిం చాలో తెలియక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారు.

Advertisement

Next Story